calender_icon.png 13 September, 2024 | 1:43 AM

సునీతా విలియమ్స్.. 2025 ఫిబ్రవరి వరకు అంతరిక్షంలోనే..?

08-08-2024 03:50:42 PM

ISS: వ్యోమ నౌకలో సాంకేతిక లోపం కారణంగా చిక్కుకుపోయిన వ్యోమయానములు సునితా విలియమ్స్ , బుచ్ విల్ మోర్ మరి కొన్ని నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐ ఎస్ ఎస్)లోనే ఉండాల్సి వస్తుందని  నాసా అధికార ప్రతినిధి తెలిపారు. 8 రోజుల మిషన్లో భాగంగా సునిత, విల్ మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వారిద్దరూ భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా.. వ్యోమ నౌకలో హీలియం ఇంధనం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురవడంతో రెండు నెలలుగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని నాసా అప్ డేట్ చేసింది. కాగా స్టార్ లైనర్ భూమ్మీద లాండింగ్కు  కుదరకపోతే వ్యోమగాములను తీసుకొచ్చేందుకు మరో ఆప్షన్ గా 2025లో స్పేస్ ఎక్స్ ,క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో తీసుకొస్తామని అధికార ప్రతినిధి వివరించారు.