calender_icon.png 20 July, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేటలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

20-07-2025 07:23:05 PM

సూర్యాపేట (విజయక్రాంతి): సూర్యాపేట పట్టణ కేంద్రంలోని చైతన్య భారతి ఉన్నత పాఠశాల(Chaitanya Bharathi High School)లో 1989-90 సంవత్సరంకు చెందిన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఆదివారం ప్రత్యేకంగా కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సమాజంలోని పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం తమవంతు సహాయ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన హేమచందర్, సుధాకర్, అమరేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సురేష్ రెడ్డి, జి ఎల్ ఎన్ రావు, ఓరిగంటి శ్రీనివాస్, గోవిందరావు, వినయ్ కుమార్, శ్యామ్, బాలచంద్రు, వెంకటేశ్వర్లు, శోభా రెడ్డి ,నిహారిక రెడ్డి , సోమలక్ష్మి, రత్నమాల, స్వర్ణలత ,విజిత, మాధవి, తదితరులు పాల్గొన్నారు.