20-07-2025 07:58:19 PM
అనంతగిరి: మండల కేంద్రంలో కమ్యూనిస్టు నారాయణరావు సంతాప సభను మండల కార్యదర్శి ఎరసాని రవి అధ్యక్షతన, జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి ఆదివారం ఘనంగా నిర్వహించారు. కమ్యూనిస్టు నినాదాలతో నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బద్దం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నారాయణరావు నాటి తెలంగాణ సాయుధ పోరాటాల నుండి ఈనాటి వరకు నిరాడంబరంగా కమ్యూనిస్టు కార్యకర్తగా అనేక పదవులు అనుభవించిన గొప్ప నాయకుడని వారు పేర్కొన్నారు. చివరి కంఠం వరకు ఎర్రజెండాను విడవకుండా జెండా కోసం ఆశువులు భాషనాడని తెలిపారు. పేదల కోసం పోరాటం చేసి జైలు జీవితాలు గడిపిన పోరాట యోధుడు అని వారు కొనియాడారు.
నేటితరం కమ్యూనిస్టులకు వారు ఆదర్శప్రాయుడని, ఎర్రజెండా ఆశయ సాధన కోసం చివరి వరకు పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షుడు డేగ వీరన్న, స్థానిక మాజీ సర్పంచ్ వేనేపల్లి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగభద్రం, మండల రైతు సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి లాల్ సాహెబ్, శాంతినగర్ గ్రామ శాఖ కార్యదర్శి వీరబాబు, అనంతగిరి కార్యదర్శి మైబు, మండల కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.