19-07-2025 11:41:56 PM
మేడిపల్లి: స్నేహితులతో కలిసి మేడ్చల్ బోనాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పిర్జాదిగూడ మున్సిపాలిటీకి చెందిన శ్రీనివాస్, సుధ దంపతులకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు జంగిడి రామ్ చరణ్(పండు)(17) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇద్దరు కుమారులను ఇంట్లో వదిలి ఈనెల 17న భార్యాభర్తలిద్దరూ పనిమీద బయటకు వెళ్లారు. చిన్న కుమారుడు తన స్నేహితులతో మేడ్చల్ బోనాలకు వెళ్తున్నానని, అన్నతో చెప్పి ఇంటి నుండి వెళ్ళాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి రాత్రి 11 గంటలకు ఫోన్ చేయగా రాత్రి 3 గంటల వరకు ఇంటికి వస్తానని తెలియజేశాడు. రాత్రి 1 గంటకి మరల ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, బంధువులను, తెలిసిన వారిని విచారించగా ఎటువంటి సమాచారం లభించక పోవడంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తండ్రి ఫిర్యాదు చేశాడు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.