106 ఎకరాల భూమి అటవీ శాఖదే..
l జస్టిస్ సుందరేశ్, ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : భూపాలపల్లిలోని కొంపల్లి శివారులో ఉన్న 106.34 ఎకరాల భూమి అటవీ శాఖకే చెం దుతుందని అత్యున్నత ధర్మాసనం గురువా రం తీర్చు చెప్పింది. 1985లో వరంగల్ జిల్లా న్యాయస్థానంలో మహ్మద్ అబ్దుల్ ఖాసీం అనే వ్యక్తి ఆ భూమి తనదే అని పిటిషన్ వేశా డు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు 1994లో అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా వాదనల అనంతరం 2018లో అటవీ శాఖకే భూమి చెందుతుందని హైకో ర్టు కూడా తేల్చి చెప్పింది. తీర్పుపై హైకోర్టులో అబ్దుల్ ఖాసీం రివ్యూ పిటిషన్ వేయగా మార్చి 2021లో భూమి అతనికే చెందుతుందని పేర్కొంది. మళ్లీ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెషల్ లీవ్ పిటిషన్‌పై జస్టిస్ సుందరేశ్, ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి అటవీ శాఖకే భూమి చెందుతుందని తీర్పు ఇచ్చింది.






