calender_icon.png 20 July, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్ లో పర్యటించిన మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్

19-07-2025 07:49:31 PM

మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 27, 28 డివిజన్లలో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా(Additional Collector Radhika Gupta) పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ శైలజ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహారెడ్డి, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ చీరాల నర్సింహ, బొమ్మక్  కళ్యాణ్, రాపోలు ఉపేందర్, తోటకూర రాజు యాదవ్, సంబంధిత అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.