24 May, 2026 | 8:56 AM

టెట్ అభ్యర్థులకు అలర్ట్

19-04-2024 01:37 AM

l రేపటితో దరఖాస్తు గడువు ముగింపు

l గతేడాది కన్నా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు

l ఫీజు పెంపే కారణం!

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) దరఖాస్తుల స్వీకరణ గడువు రేపటి(శనివారం)తో ముగియనుంది. ఈసారి గతేడాదితో పోల్చితే దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఫీజు భారీగా పెంచడంతోనే అనుకున్నంతగా అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకోలేదు. గురువారం సాయంత్రం వరకు మొత్తం 2,56,744 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో పేపర్ 92,129 దరఖాస్తులు రాగా, పేపర్ మాత్రం 1,64,615 అప్లికేషన్లు అందినట్లు పేర్కొన్నారు.

గురువారం ఒక్క రోజే పేపర్ 511, పేపర్ 1377 దరఖాస్తులు వచ్చాయి. టెట్ గడువు ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 10వ తేదీతో ముగియగా అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈనెల 20వ తేదీ వరకు పొడిగించారు.  మరోవైపు టీచర్లకు పదోన్నతులు కావాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేసినా టెట్ రాసేందుకు ఉపాధ్యాయులు కూడా ఆసక్తి చూపడంలేదని వచ్చిన దరఖాస్తుల సంఖ్యను చూస్తే స్పష్టమవుతోంది.

గతంలో టెట్‌కు 

వచ్చిన దరఖాస్తులు

సంవత్సరం దరఖాస్తులు

2016 3.40 లక్షలు

2017 3.29 లక్షలు

2022 3.79 లక్షలు

2023 2.83 లక్షల

2024 2.56 లక్షలు 

(ఈనెల 18 వరకు)