19-07-2025 02:54:02 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం ఉర్దూ మీడియం లో ఇంటర్మీడియట్లో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారి బి సునీత తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమే మాట్లాడారు. ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలలో సీఈసీ గ్రూపులో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 21న సోమవారం కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఆసక్తిగల విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పూర్తి వివరాల కోసం 8008978234 నెంబర్ల లో సంప్రదించాలని ఆమె కోరారు.