calender_icon.png 20 July, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి

20-07-2025 04:59:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాల, కళాశాలలో 8 తరగతిలో ఖాళీ సీట్ల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డానియల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏడవ తరగతి చదివి 8వ తరగతిలో చేరేవారికి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన వివరించారు. సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పాఠశాలలో బుధవారం 24 తేదీన ఉదయం 11 గంటలకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. పరీక్షల్లో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా విద్యార్థులను 8వ తరగతిలో ప్రవేశం కల్పించబడుతుందని ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు పనివేళలో పాఠశాలలో సంప్రదించాలన్నారు. ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నాము నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు.