13-02-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 12 (విజ యక్రాంతి) : త్వరలో జరగనున్న జడ్పిటి సి, ఎంపీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికా రులను నియమిస్తూ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. జిల్లాలోని 22 మండ లాలకు 22 మంది ఆరువాలను నియమి స్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
కొత్తగూ డెం నియోజకవర్గంలోని సుజాతనగర్ ఆర్వోగా శ్రీనివాస్‌రావు, లక్ష్మీదేవిపల్లి ఆర్ వోగా స్వర్ణలత, చుంచుపల్లి ఆర్వోగా సత్య నారాయణ, పాల్వంచ ఆర్‌వోగా నరసింహా రావు, కొత్తగూడెం ఆర్‌ఓగా రమేష్ బాబులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.