calender_icon.png 21 July, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల నిధులు పక్కదారి?

21-07-2025 12:37:23 AM

- భారీ ఎత్తున అవినీతి అక్రమాలు? 

- ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలపై ఏసీబీ నాజర్ 

- ఏ క్షణంలోనైనా సోదాలు? 

- రెండు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు 

భద్రాద్రి కొత్తగూడెం, జులై 20 (విజయ క్రాంతి); భద్రాచలం గిరిజన సంక్షేమ అభివృద్ధి కార్యాలయం (ఐటీడీఏ) పరిధిలో ని ఉమ్మడి ఖమ్మం జిల్లా లో నిర్వహించబడుతున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నిధులు పక్కదారి పట్టి, భా రీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఈ అంశం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెను దుమారం రేపుతోంది. ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాల్లో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసిబి )దృష్టి సారించినట్లు విశ్వా సనీయ సమాచారం . ఈనెల 17వ తేదీన ప క్క జిల్లా ఆయన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను క్షు ణ్ణంగా పరిశీలించిన సంఘటన విధితమే.

ఈ సంఘటనతో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసినదే. దీంతో భ ద్రాచలం ఐటిడిఏ పరిధిలోని 23 ఆశ్రమ పాఠశాలలపై ఏసీబీ అధికారులు దృష్టి సా రించినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా విద్యార్థుల హాజరులో గోల్మాల్, విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ మందిని రికార్డులో నమోదు చేసి వారి పేరట వచ్చే నిధులను దుర్వినియో గం చేస్తున్నారని, విద్యార్థులకు సరఫరా చేసే సరుకుల టెండర్లలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

వస్తు వుల కొనుగోలు, ఇతర సేవల కోసం నిర్వహించే టెండర్లలో ఉన్నత అధికారులు పక్షపాత వైఖరి అవలంబించి దగ్గరి బంధువులకు, అనుయాయులకు, ఎక్కువ కమిష న్లు ఇచ్చే వారికి కాంట్రాక్టు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయు లు కాంట్రాక్టర్లతో లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు నాసిరకం సరుకులను సరఫరా చేస్తూ, అధిక ధరలకు బిల్లు లు సమర్పించి ప్రభుత్వ ధనాన్ని దోచు కుం టున్నారనే ఆరోపణలు వస్తున్నాయి .

ఆడిట్ అధికారులను సైతం తప్పుదోవ పట్టించి రికార్డులను తారుమారు చేస్తున్నారని ఏసీబీకి ఫి ర్యాదుల అందినట్టు సమాచారం. మహబూబాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాల అ నంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆ శ్రమ పాఠశాలల, వసతి గృహాల ప్రధానోపాధ్యాయులు, వార్దన్లు సిబ్బందిలో భ యాందోళన చోటుచేసుకుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంపై ప్ర భుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.