calender_icon.png 20 July, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిష్మతిలో ముగిసిన అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

19-07-2025 09:01:24 PM

కరీంనగర్,(విజయక్రాంతి): జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్  కళాశాలలో ఏ ఐ సి టి ఇ శిక్షణ, అభ్యాసం అకాడమీ వారి సౌజన్యంతో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో అటానమస్ అండ్ కనెక్టెడ్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అంశంపై  నిర్వహించిన ఆరు రోజుల స్పాన్సర్డ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శనివారం ముగిసింది. కళాశాల చైర్మన్ జవ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఓయు  కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ & హెడ్ డాక్టర్ పి. సతీష్ కుమార్ హాజరై మాట్లాడుతూ విద్యా-పరిశ్రమ సినర్జీ కోసం పెరుగుతున్న అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. వివిధ కళాశాలల నుండి పాల్గొన్న దాదాపు 50 మంది అధ్యాపకులు తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారని,  కార్యక్రమానంతరం  సర్టిఫికెట్లు పంపిణీ చేయబడ్డాయని  కో కన్వీనర్ డా. యం. మణికందన్ తెలిపారు.