calender_icon.png 19 July, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన సదస్సు

19-07-2025 02:17:55 PM

నిజామాబాద్: జన విజ్ఞాన వేదిక తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మండలము కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో భారత రాజ్యాంగం పై తొమ్మిది, 10వ తరగతి విద్యార్థులకు రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం మీద ప్రవేశికలో ఉన్నటువంటి పదాల విస్తృత అర్ధాన్ని, 1976కు ముందలే లౌకికత్వాన్ని తెలియజేసే అంశము ఆర్టికల్ 14 నుండి 26 వరకు ఉన్నాయన్న విషయాన్ని, దానినే 1976లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రీయంబుల్లో బహిర్గతం చేయటం జరిగిందని, దీనిపై రాద్ధాంతం అవగాహన రాహిత్యమేనని,  రాజ్యాంగము ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత రాబోయే తరం మీద ఉన్నదన్న అంశాన్ని స్పృశిస్తూ నిన్నటి రోజున నర్రా రామారావు రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో అవగాహన తరగతులు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రంజిత్, పాఠశాల ప్రిన్సిపాల్ గంగామణి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.