20-07-2025 01:37:10 AM
* పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ రాష్ట్ర కమలదళాధిపతిగా నూతనంగా ఎన్నికైన ఎన్ రాంచందర్‌రావు పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. వివాదాస్పద అంశాలపై పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయొద్దని ఆయన స్పష్టతనిచ్చిన కొద్దిరోజులకే హుజూరాబాద్ వేదికగా కొత్త, పాత నాయకుల మధ్య పోరాటం రచ్చకెక్కింది.
బీజేపీ నేత, మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం సొంత పార్టీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానని, తన జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించడంతో కమలం పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి.
బీ కేర్‌ఫుల్ కొడకా.. నా జోలికొస్తే ఖబర్దార్
మేడ్చల్, జూలై 19 (విజయక్రాంతి): పార్టీలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ హుజూరాబాద్‌కు చెందిన ఈటల వర్గం నాయకులు శనివారం మేడ్చల్ జిల్లా పూడూరు శివారులోని ఈటల రాజేందర్ నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడు తూ ‘హుజూరాబాద్ నుంచే నేను అనేక పోరాటాలు చేశా.
ఒక సైకో, శాడిస్టు, వాడు మనిషా, ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఇష్టమొచ్చినట్టు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టిస్తున్నాడు.. కొడుకా బీ కేర్ ఫుల్’ అని మండిపడ్డారు. ‘ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారో, ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు. ఈ విషయంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తా’ అని స్పష్టం చేశారు.
రెచ్చగొడుతున్న వారికి సంస్కారం, సభ్య త ఉంటే దుష్ప్రచారాన్ని అరికడతారని భావిస్తున్నానని, లేకుంటే ఎవరు నష్టపోతారో వారే అర్థం చేసుకోవాలన్నారు. నా చరిత్ర వారికి చాలా తక్కువ తెలుసు, రెండుసార్లు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రెండుసార్లు మం త్రిగా, ఫ్లోర్ లీడర్‌గా పనిచేశానని, కరీంనగర్ జిల్లాలో తన అడుగు పడని పల్లె లేదని అన్నారు. పదవుల కోసం ఎన్నడూ పార్టీలు మారలేదని ఆయన స్పష్టం చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో వార్డు మెంబర్, సర్పంచ్ తమ వాళ్లే ఉంటారని, స్థానిక సం స్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటానని ఆయన వివరించారు. 20 ఏళ్లుగా నా యకులు, కార్యకర్తలు తన వెంట నడుస్తున్నారని, కేసీఆర్ పార్టీ నుంచి వెళ్లగొట్టిన సమ యంలోనూ తనకు అండగా ఉన్నారని చె ప్పారు. ‘గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌కు నా నిర్ణయాలు మొహమాటం లేకుండా చె ప్పా. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజల ఆత్మగౌరవం గెలిచింది.
నేను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నియో జకవర్గాన్ని అభివృద్ధి చేశా. గతంలో హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో నా ఓటమికి చా లా మంది కుట్రలు చేశారు. నేను పోరాటా లు చేస్తే కరీంనగర్ ప్రజలు అండగా ఉండేవారు. హుజూరాబాద్ గడ్డలో ప్రతి గ్రామం లోని వార్డు సభ్యుడిని గెలిపిస్తా’ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అవమానాలు, అవ హేళనలు ఉంటాయని, వాటిని తట్టుకున్నామని చెప్పారు.
‘నాకు స్ట్రయిట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. కడుపులో కత్తులు పెట్టుకొని రాజకీయం చేయడం మాకు చేతకాదు. పైకోమాట.. లోపల ఓ మాట మాట్లాడటం నాకు తెలియదు. శత్రువుతో నేరుగా కొట్లాడుతా. స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన చరిత్ర నాది. నాపై గతంలో కేసీఆర్.. ఇప్పు డు రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నారు. రాజకీయాల్లో అబద్ధాల పునాదులపై కొం దరు కాలం వెల్లదీస్తున్నారు. నిజాయతీగా పార్టీ కోసం కష్టపడటం తప్ప నాకు మరొకటి తెలియదు’ అని పేర్కొన్నారు.
హుజూరా బాద్ చైతన్యానికి మారుపేరని, క్యాడర్‌కు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరని.. నా చరిత్రేంటో వారికి తెలుసునన్నారు. వ్యక్తులు ఎదగకుండా పార్టీ బలపడదని.. కార్యకర్తల ఆవేదన అర్థమైందన్నారు. కార్యకర్తల రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహా యం గా లేననన్నారు. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పారు.
హుజూరాబాద్‌లో వర్గపోరు..
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా కొనసాగి ఇప్పుడు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. కేసీఆర్‌తో విభేదాల కారణంగా ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే కరీంనగర్ పార్లమెంట్ నుం చి గెలిచిన బండి సంజయ్.. హుజూరాబాద్‌పై కూడా ఆధిపత్యం చలాయిస్తుండటం తో ఈటల వర్గంలో ఆందోళన నెలకొంది.
పార్టీ పదవుల్లో ఈటల వర్గానికి మొండిచె యి చూపిస్తూ సంజయ్ తన వర్గానికి పెద్ద పీట వేస్తుండటం, మరోవైపు స్థానిక సమరానికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ఊహా గానాలతో ఈటల వర్గీయులు తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి తాడో పేడో తేల్చుకునేం దుకు హైదరాబాద్‌లోని ఈటల నివాసానికి అనుచర వర్గం శనివారం వెళ్లారు. బండి వ ర్గం ఆధ్వర్యంలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఈటల వర్గానికి చెందిన నా యకులకు ఆ కార్యక్రమంపై కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం, ఫ్లెక్సీల్లో ఈటల రాజేందర్ ఫొటో పెట్టకపోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
గ్రూపులు చెల్లవ్!
హుజూరాబాద్ (విజయక్రాంతి): రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. బీజేపీలో వర్గా లుండవని స్పష్టం చేశారు. వ్యక్తుల కోసం పనిచేస్తే టికెట్లు రావని కుండ బద్ధలు కొ ట్టారు. ఎక్కడా లేని పంచాయితీ హుజూరాబాద్‌లోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసేవాళ్లకు భవిష్యత్తు ఉం టుందని చెప్పుకొచ్చారు.
పరోక్షంగా ఈటలను ఉద్దేశించి.. ఒకాయన పార్టీలో చేరిన ప్పుడు తాను అంత యాక్టివ్‌గా లేనని చెప్పా రు. ఎవరి రాజకీయ భవిష్యత్ వారిదేనన్నా రు. లోకసభ ఎన్నికల్లో పార్టీకి హుజూరాబాద్‌లో తక్కువ ఓట్లు రావాలని పనిచేశారని, ఆ వివరాలు తన వద్ద ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు టికెట్లు ఇవ్వ మంటారా అని ప్రశ్నించారు. ఎవరు ఏ వర్గ మో నాకేం తెలుస్తుందని అన్నారు. అంద రూ పార్టీ కోసమే పనిచేయాలని తెలిపారు.