calender_icon.png 19 July, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

19-07-2025 12:32:42 PM

నూతనకల్, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని బాలుర వసతి గృహం బాలికల వసతి గృహం లలోని విద్యార్థులకు సీజనల్ వ్యాధులు(Seasonal Diseases) వ్యక్తిగత పరిశుభ్రత పై శనివారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ చరణ్ నాయక్ మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షాలు పడడం వలన మన ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండడం వలన దోమలు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయని,అవి కుట్టడం వలన మలేరియా, డెంగ్యూ,చికెన్ గున్యా వంటి వ్యాధులు ఒకరి నుండి మరొకరికి కుట్టి వ్యాప్తి చేస్తాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ వర్ష కాలంలో నీరు కలుషితం కావడం వలన,కలుషితమైన ఆహారం పదార్థాలు , ఈగలు వాలిన ఆహార పదార్థాలు తినడం వలన , టైఫాయిడ్,నీళ్ల విరేచనాలు,బంక విరేచనాలు, కలరా సంభవించే అష్కరం ఉన్నందున వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో  ఉపాద్యాయులు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు