calender_icon.png 20 July, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సల్లంగా చూడు పోచమ్మ తల్లి..

20-07-2025 02:30:06 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి పోచమ్మ టెంపుల్ భక్తులతో కిటకిటలాడింది. ఆషాడ మాసాo చివరి ఆదివారం  ఆషాడo బోనాల పండుగ అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రజలు బోనాలతో నైవేద్యం సమర్పించారు. బోనాలతో పోచమ్మ టెంపుల్ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఇష్టమైన కోళ్లు, మేకలతో భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. పట్టణంలోని ఆయా బస్తీల నుంచి డబ్బు సప్పులతో బోనం ఎత్తుకొని భక్తులు మేకలు, కోళ్లతో ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. చల్లంగా చూడు తల్లి అని భక్తులు వేడుకున్నారు. ఎదుర్కొల్లు, మేకలను అమ్మవారికి బలిచ్చారు.