24 May, 2026 | 12:00 PM

బీజేపీలో చేరిన భేతి సుభాష్‌రెడ్డి

19-04-2024 01:21 AM

ఉప్పల్, ఏప్రిల్ 18 : ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం బండారి లక్ష్మారెడ్డికీ కేటాయించడం, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిరిగి ఎంపీ టికెట్ తనకు వస్తుందని ఆశించిన ఇతరులకు కేటాయించడంతో ఆయన బీజేపీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.