20-07-2025 05:38:22 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద కొత్త సీఐగా రవికుమార్ ఇటీవల పదవి బాధ్యతలను చేపట్టారు. దీనిని పురస్కరించుకొని జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆదివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు(MLA Thota Laxmi Kantha Rao)కు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. బిచ్కుంద సర్కిల్ పరిధిలోని మండలాల ప్రజలందరికీ పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఐ రవికుమార్ కు సూచించారు.