calender_icon.png 20 July, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకతీతంగా సాయం చేసే నాయకుడు కర్నె ప్రభాకర్

20-07-2025 02:37:48 PM

కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో నాయకులు

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో మాజీ శాసన మండల సభ్యులు ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో పార్టీలకతీతంగా మానవతా దృక్పథంతో సాయం చేసే మనసున్న నాయకుడు కర్నె ప్రభాకర్ అని అన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఎంతోమందికి లబ్ధి చేకూర్చారని, ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని పార్టీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.