బీజేపీ, బీఆర్‌ఎస్‌లను చిత్తుగా ఓడించాలి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రజలకు పిలుపునిచ్చారు. కామారెడ్డిలో గురువారం నిర్వహి ంచిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా వివిధ మండ లాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, నాయకులు పండ్ల రాజు, ఆనంద్‌రావు, రాజాగౌడ్, మోహన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, భీంరెడ్డి, నర్సింహులు, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.






