20-07-2025 06:21:01 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలోని గాంధారి మైసమ్మ ఆలయంలో అమ్మవారిని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ లు దర్శించుకున్నారు. ఆషాడ మాసం బోనాల జాతర(Bonalu festival) పురస్కరించుకొని ఆదివారం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలతో పాటు, చెన్నూరు చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు జనార్దన్, సీనియర్ నాయకులు డివి దీక్షితులు, దేవరనేని సంజీవ రావు, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు దన్ సింగ్, కోటపల్లి మాజీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య, కోటేశ్వర రావు పల్లె బూత్ అధ్యక్షుడు సాయి లు పాల్గొన్నారు.