calender_icon.png 19 July, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూరాబాద్.. అనేక త్యాగాలకు అడ్డా

19-07-2025 02:42:47 PM

హైదరాబాద్: హుజూరాబాద్ బీజేపీ కార్యకర్తలతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Eatala Rajender) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ...  శామీర్ పేట్ బీజేపీ కార్యకర్తలకు అడ్డా.. హుజూరాబాద్.. అనేక త్యాగాలకు అడ్డా.. అన్నారు. హుజూరాబాద్ నుంచే అనేక పోరాటాలు చేశామన్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ నుంచి బయటికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. నేను పదవుల కోసం పార్టీ మారలేదని తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కు నా నిర్ణయాలు మోహమాటం లేకుండా చెప్పానని వివరించారు.

గతంలో 6 నెలలు కొట్లాడి హుజూరాబాద్ ఉప ఎన్నికలు(Huzurabad by-elections) నిర్వహించారు. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని ఈటల పేర్కొన్నారు. నేను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని వివరించారు. హుజూరాబాద్ లో నా ఓటమికి చాలా మంది కుట్రలు చేశారని వెల్లడించారు.  కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయడం మాకు చేతకాదని చెప్పిన ఈటల స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన చరిత్ర తనదన్నారు. నాపై గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుట్రలు  చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో అబద్ధాల పునాదులపై కొందరు బతుకున్నారని ఆయన వెల్లడించారు. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడటం తప్ప మరొకటి తెలియదన్నారు. కేడర్ కు అందబాటులో ఉంటూ అండగా ఉంటానని ఈటల హామీ ఇచ్చారు.