24 May, 2026 | 5:16 PM

Breaking News

పిసిసి అధ్యక్షుని సన్మానించిన కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు   •   నవజాత శిశువు పట్ల జాగ్రత్తగా ఉండాలి   •   అటవీ సమీప గ్రామాల వారు తగు జాగ్రత్తలు పాటించాలి: ఎఫ్ఆర్ఓ   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ   •   రైతులను నిలువు దోపిడి చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం   •   పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గుర్తింపు   •   వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు ఎక్కడా.. ఎప్పుడూ జరగలేదు   •   మధ్య దళారులను నమ్మవద్దు   •   బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో యువకుడు ఆత్మ హత్య కలకలం   •   గుంజపడుగు గ్రామపంచాయతీ వర్కర్లకు రూ.15 లక్షల ఇన్సూరెన్స్   •  

కడియం కావ్యను ఆశీర్వదించండి

19-04-2024 12:41 AM

l బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ గెలవాలి 

l మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

వరంగల్, ఏప్రిల్18 (విజయక్రాం తి): వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తు న్న డాక్టర్ కావ్యను నిండు మనుసుతో ఆశీర్వదించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. వరంగల్‌లో గురువారం జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో కడియం మాట్లాడుతూ.. వర్ధన్నపేటకు చెందిన వ్యక్తినే అయి నప్పటికీ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రాకున్నా అభివృద్ధిలో మాత్రం తన పాత్ర ఉన్నదని చెప్పారు. రాజకీయాల్లోకి సేవ చేయడానికి రావాలే తప్ప వ్యాపారం కోసం కాదని పేర్కొన్నారు.

ఇటీవల శాసనసభ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పుకు చిన్న మెదడు చిట్లిపోయిన వ్యక్తులు కావ్య నాన్‌లోకల్ అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వందల ఎక రాల భమూలు అక్రమంగా సంపాదించుకున్న వ్యక్తి రమేశ్ అని ఆరోపించారు. అందుకే శాసనసభ ఎన్నికలలో చావుదెబ్బ తిన్నారని ఎద్దేవాచేశారు. దేశంలో బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాల మీద దాడులు జరుగుతున్నాయన్నారు.

మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించడమే కాకుండా లౌకిక వాదం లేకుండా పోయే ప్రమాదమున్న నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం కాంగ్రె స్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. బీజేపీ గత పదేండ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను నాన్‌లోకల్ అంటున్న భూ బకాసురుడు రమేశ్‌ను, బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళంలోకి తొక్కాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్‌రెడ్డి, సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, వరంగల్ జిల్లా కాం గ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.