calender_icon.png 19 July, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమిత పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ సంబరాలు

19-07-2025 02:27:22 PM

కరీంనగర్,(విజయక్రాంతి): స్థానిక  మంకమ్మతోటలోని  పారమిత ఉన్నత పాఠశాలలో ఆషాడ మాస భోనోత్సవాన్ని పారమిత పాఠశాలల డైరెక్టర్ ప్రసూన ప్రసాదరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విధ్యార్థులు స్వయంగా బోనాలు ఎత్తుకుని, పులివేశాలు, పోతురాజుల వేషాలు ధరించి డప్పు సప్పుల్ల కొలహాలంతో సందడి చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించిన వైనం అంబరాన్నంటింది. విధ్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం మంత్ర ముగ్ధులను చేశాయి.

ఇట్టి కార్యక్రమంలో విధ్యార్థులు చెప్పిన అమ్మవారి భవిష్యవాణి  స్వయంగా అమ్మవారు పారమిత పాఠశాలకు వచ్చి ఆశీర్వదించిన ఆశీర్వచనాలు వీనులవిందుగా అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇట్టి కార్యక్రమంలో  పారమిత విధ్యాసంస్థల డైరెక్టర్ ప్రసూన ప్రసాదరావు రావు కార్యక్రమాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ విధ్యార్థిని విధ్యార్థులు మరియు విధ్యార్థుల మాతృమూర్థులు  స్వయంగా బోనాలు ఎత్తుకుని, అమ్మవారికి బోనాలు సమర్పించడం అమ్మవారి భవిష్యవాణి  విధ్యార్థులు స్వయంగా వివరించే విధానం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే విధ్యార్థిని విధ్యార్థులు మన సంస్కృతిని నేర్చుకుని ముందుకు తీసుకువెళ్ళే విధానం పట్ల ఆనందం వెల్లుబుచ్చారు. 

ఆషాడ మాసంలో పార్వతి అమ్మవారు గ్రామాలలో పోచమ్మ, గంగానమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ మొదలగు నామాలతో 101 అవతారాల రూపంలో ప్రజలను వరదలనుండి, అంటువ్యాదులనుండి, కరువుకాటకాల నుండి ప్రజలను కాపాడుతూ ఉంటుందని, కావున ప్రజలు స్త్రీ దేవతలకు బోనాల రూపంలో పూజలు చేసి అమ్మ వారి ఆశీస్సులు పొందుతారు అంటూ స్త్రీ యొక్క గొప్ప తనాన్ని ఓర్పును , సహనంను, కోపాన్ని  వివరించారు. అలాగే మనం కూడా స్త్రీని గౌరవించి, స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని సన్మార్గంలో నడవాలని  విధ్యార్థిని విధ్యార్థులకు మార్ఘ నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు విధ్యార్థులకు, ఉపాద్యాయుయలకు  తల్లిదండ్రులకు, మిత్రులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.