19-07-2025 09:06:02 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): రేకుర్తిలోని పారడైస్ పాఠశాలలో శనివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోతురాజు, అమ్మవారి వేషధారణలతో బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్ల మధ్య సాంప్రదాయ వేషధారణలతో సందడి చేశారు. ముఖ్యఅతిథిగా పాఠశాల చైర్మన్ డాక్టర్ పి. ఫాతిమా రెడ్డి పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీ. వసంత, వైస్ ప్రిన్సిపాల్ మధు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.