calender_icon.png 20 July, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకానంద పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు

19-07-2025 07:01:48 PM

పోతురాజుల వేషధారణలో అలరించిన విద్యార్థులు..

పటాన్ చెరు/జిన్నారం (విజయక్రాంతి): మండల కేంద్రం జిన్నారంలోని వివేకానంద హై స్కూల్(Vivekananda High School)లో శనివారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కరుణా సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోతురాజుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. విద్యార్థినిలు డాన్సులతో అలరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కరుణా సాగర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అన్నా, నేటి విద్యార్థులు రేపటి పౌరులని భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను వివరించేందుకే పాఠశాలలో బోనాల పండుగను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.