calender_icon.png 21 July, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బోనాల ఉత్సవాలు

20-07-2025 10:14:45 PM

మేడ్చల్ అర్బన్: మేడ్చల్ పట్టణంలో బోనాల పండుగ(Bonalu festival) సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాలకు మహిళలు బోనాలను ఊరేగింపుగా డప్పు చప్పులతో తీసుకెల్లి అమ్మవార్లకు సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. తెలంగాణ సంప్రదాయంలో బోనాల పండుగకు ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. గ్రామదేవతలు గ్రామంలోని ప్రజల ఆరోగ్యంతో పాటు పాడిపంటల సమృద్ధికై బోనాల పండుగ జరుపుకుంటామని చెప్పారు. సాయంకాలం వేల యువకులు పలు కాలనీల నుంచి అమ్మవారు ఆలయాలకు భారీ లైటింగ్ డప్పు చప్పులతో పలహారం బండ్లను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు.