19-07-2025 11:39:12 PM
బోనమెత్తిన చుండూరు కోటేశ్వరరావు వాణి దంపతులు..
వైరా (విజయక్రాంతి): వైరాలోని వాణి వివేకానంద విద్యాలయం(Vani Vivekananda Vidyalayam)లో ఆషాడ మాస సందర్భంగా బోనాల వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు బోనాలు తయారుచేసి అమ్మవారి విగ్రహాలను అలంకరించి పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో బోనాల వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ చుండూరి కోటేశ్వరావు, ప్రిన్సిపాల్ వాణి హాజరయ్యారు.
ప్రిన్సిపాల్ చుండూరు వాణి బోనమెత్తి పండుగను అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకమైన పండుగ బోనాలు అని ఈ యొక్క పండుగ మన సొంత రాష్ట్రంలో జరుపుకోవడం చాలా ప్రత్యేకతతో కూడుకున్నదని మన ఆచార సాంప్రదాయాలకు బోనాల పండుగ ఇలాంటి పండుగ వేడుకలను మన పాఠశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కన్వీనర్ గింజుపల్లి జనార్ధన్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థినీ, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.