calender_icon.png 21 July, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీర్జాదిగూడలో ఘనంగా ఆషాడ మాసం బోనాల పండుగ

20-07-2025 07:44:07 PM

ముఖ్య అతిథులుగా వజ్రెష్ యాదవ్, సుధీర్ రెడ్డి.. 

మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ ఆషాడ బోనాల పండుగ(Bonalu festival) సంబరాలలో వివిధ ఆలయాల బోనాల పూజలలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ దేవతల విశిష్టత, స్త్రీ శక్తికి ప్రతిరూపంగా నిలిచే బోనాల ద్వారా అమ్మవార్లను పూజించడం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనమని తెలిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివ గౌడ్, ప్రజా ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.