calender_icon.png 19 July, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి దీవెనలతో ఈ ఏడు వర్షాలు బాగా కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

19-07-2025 03:06:57 PM

మంథని,(విజయక్రాంతి): తెలంగాణ బోనాల సందర్భంగా ముందస్తుగా మంథని కాకతీయ పాఠశాలలో బోనాల సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరము ఆషాడ మాసంలో నిర్వహించే బోనాల సందర్భంగా కాకతీయ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బోనమెత్తారు. ఈ సందర్భంగా కాకతీయ పాఠశాల ప్రాంగణం నుండి బోనమెత్తి ఊరేగింపుగా రేణుక ఎల్లమ్మ గుడి  వరకు ఊరేగింపుగా వెళ్లారు. విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలతో రేణుక ఎల్లమ్మ గుడి వరకు బోనాలతో అంగరంగ వైభవంగా ఆటపాటలతో ఈ శోభయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా  సనాతన ధర్మ ప్రచారకులు రాష్ట్ర కార్యదర్శి రాజమౌళి గౌడ్ మాట్లాడుతూ మన యొక్క తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అందరికీ తెలియజెప్పడం మన బాధ్యత అని, ఇలాంటి కార్యక్రమము మంథని పట్టణంలో నిర్వహించడం మొట్టమొదటిసారి అని ప్రశంసిస్తూ పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డికి భగవద్గీతను అందజేశారు. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ వానలు బాగా కురవాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పంటలు బాగా పండాలని కోరుకుంటూ అమ్మవారి దీవెనలు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.

మంథని డివిజన్ లోనే ఇలాంటి కార్యక్రమము నిర్వహించడం మొట్టమొదటిసారి అని అన్నారు. అనంతరము రేణుక ఎల్లమ్మ గుడిలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పాఠశాల డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.