19-07-2025 10:34:04 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) మద్నూర్ మండల కేంద్రంలోని కార్మేల్ పాఠశాలలో శనివారం బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోనాల ఎత్తుకొని పోతు రాజుల వేషాధారణలో విద్యార్థులు పండుగ ఉత్సవం జరుపుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేపట్టారు. విద్యార్థులు బోనాల పాటలతో నృత్యాలు చేసి సందడి చేశారు. పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బంటువార్ మనోజ్, మధుసూదన్ వ్యాస్, హన్మంత్ రావ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.