20-07-2025 05:47:24 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని సాగర్ కాలనీ, ప్రియదర్శనినగర్ కాలనీ ఆధ్వర్యంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు పూణకాల మధ్య భారీ ఊరేగింపు చేపట్టారు. అనంతరం ప్రియదర్శినినగర్ నగర్ పోచమ్మ, బంగల్ పేట్ మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల వరకు బోనాలను నెత్తిన పెట్టుకొని వెళ్లి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మేకలను బలిచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. తమ పిల్లాపాపలను చల్లగా చూడాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఆషాడ మాసం బోనాల సందర్భంగా జిల్లా కేంద్రం పూర్తిగా పండుగ వాతావరణం తలపించింది. తమ తమ బంధువులను తమ ఇళ్లకు పిలిచి విందు భోజనాలు ఇచ్చారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.