calender_icon.png 20 July, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ ఆర్ పాఠశాలలో ఘనంగా బోనాలు

19-07-2025 08:18:45 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆషాడ మాసం పురస్కరించుకొని జరుగుతున్న లష్కర్ బోనాల(Lashkar Bonalu) సందర్బంగా నల్లగొండ పట్టణం, చర్లపల్లిలోని ఎస్ఆర్ విద్యా సంస్థల్లో శనివారం ముందస్తుగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినులు బోనం ఎత్తుకొని ప్రదర్శన చేసారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చారు. విద్యార్థుల పోతరాజు వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పాఠశాల జోనల్ ఇంచార్జి దోనాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం, ఆచారాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రూప  ఏఓ సరితారెడ్డి, ఉపాధ్యాయినులు, ఉపాడ్యయేతర సిబ్బంది మరియు  విద్యార్థులు హాజరయ్యారు.