calender_icon.png 21 July, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో ఘనంగా బోనాలు

20-07-2025 11:10:10 PM

గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని పేదల డబుల్ బెడ్ రూమ్ కాలనీలో, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ బీడీ కాలనీ లోనూ ఆషాడం బోనాల పండుగ(Bonalu festival) ఆదివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజ్ఞాపూర్ లో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి(DCC President Thumkunta Narsa Reddy) బోనాల సంబరాల్లో పాల్గొని బోనం ఎత్తారు. గజ్వేల్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారులు వేప చెట్టు కింద పోచమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చిందన్నారు. ఆషాడం బోనాల నిర్వహణకు అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రకృతిని అమ్మవారి రూపంలో పూజించి నైవేద్యం సమర్పించడమే బోనంగా ప్రసిద్ధికెక్కిందని అన్నారు. ప్రజలంతా బోనాలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవార్ల దయతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని కోరుతున్నారు. కార్యక్రమాలలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.