19-07-2025 08:02:31 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోతురాజుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నది. డప్పు చప్పుల్లతో బోనాలను అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. బోనాల ఊరేగింపుగా అమ్మవారి వద్దకు వెళ్లారు. ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ కుమార్ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను జరుపుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.