24 May, 2026 | 10:20 AM

సీసీ రోడ్డు పనులు ప్రారంభం..

03-02-2025 08:27 PM

రూ.20 లక్షల నిధులతో శంకుస్థాపన..

ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కార్పొరేటర్ సుజాత నాయక్ అన్నారు. డివిజన్ పరిధిలోని శ్రీ రమణ కాలనీలో రూ. 20 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అధికారులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. శ్రీ రమణ కాలనీలో మిగిలి ఉన్న మిగతా రోడ్లను సైతం త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూదిని వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు కాంతారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాము, మమతా మల్లేశ్ గౌడ్, మురళి, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.