calender_icon.png 20 July, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు చిన్నతనం నుండే సమాజం, పెద్దల పట్ల గౌరవ మర్యాదలను నేర్పించాలి

20-07-2025 07:20:43 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో బాల సంఘం మొదటి సమావేశం ఆదివారం రోజున కొత్తపెల్లి సాన్విత అధ్యక్షతన జరిగింది. బాల సంఘం మొదటి సమావేశమునకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. చిన్నతనం నుండే పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపడానికి అలాగే విద్యతో పాటు వినయాన్ని నేర్పించాలని, ఏ రంగంలోనైతే పిల్లలు ఉత్సాహంగా ఉంటారో వారికి ఆ రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలని, క్రీడలతో పాటు, సంగీతం, కరాటే, క్విజ్ పోటీలు, జనరల్ నాలెడ్జిని వారికి నేర్పించాలని, సమాజం పట్ల, దేశం పట్ల అవగాహన కల్పిస్తూ, పెద్దలను గౌరవించే విధానాన్ని నేర్పించాలని, నేటి బాలలే రేపటి అత్యున్నతమైన పౌరులుగా తయారవ్వడానికి చిన్నతనం నుండే పునాది వేయాలని, మానవ సంబంధాల పట్ల, ఇతరుల పట్ల గౌరవ మర్యాదలను నేర్పించాలని అన్నారు. 

ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రామండ్లపెల్లి యుగేందర్, బాల సంఘం సభ్యులు బి. కారల్ మార్క్స్, పి.ప్రజ్వల్,బి.సుకృత షర్మీ, కె.సాన్విత,బి.సాహు మహరాజ్, సి హెచ్.సన్నిహిత,బి.సంహిత్, కె.ప్రజ్ఞస్తి,వి.జయదీప్,దక్షిత్, ఎల్.క్రాంత్,కాశీ, కె.పవిత్ర, శ్రీ వర్ధన్ చారి మరియు జి.ప్రణీత్ పాల్గొన్నారు.