19-07-2025 08:12:42 PM
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.శనివారం ధర్మపురి మండలం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ భూ సేకరణ విస్తరణ భూములు, ఇండ్ల స్థలాలను పరిశీలించి, పనులను వేగవంతంగా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.