calender_icon.png 20 July, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనిఖీలతో హడలెత్తించిన కలెక్టర్

19-07-2025 09:06:27 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల(Tribal Welfare Gurukul School)లో ఏసీబీ తనిఖీల నేపథ్యంలో బయటపడ్డ డొల్లతనంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, వివిధ మండలాలకు నియమించిన ప్రత్యేక అధికారులుగా నియమితులైన జిల్లాస్థాయి అధికారులు తనిఖీలతో హడలెత్తించారు. జిల్లా కలెక్టర్ శనివారం రాత్రి కురవి ఏకలవ్య పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు వండిపెట్టిన ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూశారు. అదనపు కలెక్టర్ కురవి మండలం మన్నెగూడెంలో పర్యటించి విద్యా బోధన తీరును పరిశీలించారు. ఇలా జిల్లా స్థాయి అధికారులంతా విద్యా వ్యవస్థ మెరుగు పరచడానికి తనిఖీల్లో పాల్గొన్నారు.