calender_icon.png 20 July, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు పాటించకుంటే ఎలా?

19-07-2025 06:47:41 PM

ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓకు ఫిర్యాదు..

రాజాపూర్: మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు బాల్ రాజ్ అన్నారు. శనివారం రాజపూర్ మండల(Rajapur Mandal) ఏబీవీపీ శాఖ అధ్వర్యంలో మండల విద్యాధికారి సుధాకర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంతో పాటు మండలంలో గుర్తింపు లేని పాఠశాలల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి కోరారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలను తీసేయాలని డిమాండ్ చేశారు. పేద, బడుగు బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పుస్తకాల పేరుతో విద్యను వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు హన్మగాళ్ల బాల్ రాజ్, మణికంఠ, బాలకోటి, చెందు, పవన్, దాస్, తదితరులు పాల్గొన్నారు.