కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరిచింది
బెజ్జంకిలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
l బీజేపీకి ఓటేస్తే పెనంమీది నుంచి పొయ్యిలో పడినట్టే
l బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి
l బెజ్జంకి రోడ్‌షోలో మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను మరిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి రోడ్‌షో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆరుగ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
క్వింటాలు వడ్లు రూ. 2500లకు కొంటామన్నారు ఏమయ్యిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు ప్రకటించిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంటుందన్నారు. కరీంనగర్ పరిధిలో బండిసంజయ్ అభివృద్ధికి ఐదు పైసలు కూడా తేలేదని, బెజ్జంకి లక్ష్మినరసింహస్వామికి ఒక్కరూపాయి తెచ్చాడా అని ప్రశ్నించారు. బోయినపల్లి విజయ్‌కుమార్‌ని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






