24 May, 2026 | 10:59 AM

కాంగ్రెస్‌ది నిర్లక్ష్య వైఖరి

19-04-2024 01:33 AM

l ఎన్నికల లబ్ధి కోసం రైతులను ఇబ్బంది పెడుతోంది

l కాఫర్ డ్యామ్ కట్టి పొలాలకు నీళ్లు ఇవ్వాలి

l బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. ఆయన ఎక్స్ వేదికగా గురువారం స్పందిస్తూ ఇంత నికృష్టయైన రాజకీయాలు కేవలం లోక్‌సభ ఎన్నికల్లో లాభం కోసమేనా అంటూ ప్రశ్నించారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి, మరమ్మతులు చేయాలని, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు.

నీటిపారుదల శాఖ ఇంజినీర్లు నివేదిక ఇచ్చిన తరువాత కాఫర్ డ్యామ్ కట్టేందుకు ఎల్ అండ్ టీ కంపెనీ ముందుకు వచ్చినా ఈ ప్రభుత్వం చిలర్ల రాజకీయాలతో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కేసీఆర్‌ను అబాసుపాలు చేయాలనే ఒకే ఒక్క ఎజెండాతో కాఫర్ డ్యామ్ కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగ్‌లను షేర్ చేశారు.