19-07-2025 06:28:47 PM
మునిపల్లి: మండల పరిధిలోని చిన్న చెల్మెడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చర్చి నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రుద్రకృష్ణ తనవంతుగా రూ.50 వేల నగదును చర్చి నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా రుద్రకృష్ణకు చర్చి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బాలకృష్ణ, పరమేశ్వర్, గ్రామస్తులు కమ్మరి నర్సింలు, ఖాదర్, జావీద్, సంగయ్య స్వామి, పెంటయ్య, శివకుమార్, తుల్జారాం, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.