calender_icon.png 21 July, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరపైకి నిర్మల్ రైల్వే లైన్ నిర్మాణం

21-07-2025 12:35:41 AM

  1. కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు
  2. ఎన్నికల హామీలు ప్రధాన అంశం అవుతున్న హామీ

నిర్మల్, జూలై ౨౦ (విజయక్రాంతి):  నిర్మల్ ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణం మళ్లీ తెరపైకి వచ్చింది. నిర్మల్ అదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన నిర్మల్ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే నిర్మాణం చేపట్టాలని ఇక్కడి ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా కోరుతున్నారు. ప్రతి ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏ పార్టీలైన నిర్మల్ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చిన ఆచరణలో మాత్రం అది అమలు కాకపోవడం పై ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అదిలాబాదు నుండి హైదరాబాద్ వెళ్లేందుకు మహారాష్ట్రలోని కిన్వర్ట్ బోకర్ ముత్కేడ్ ధర్మాబాద్ మీదుగా బాసరకు చేరుకొని హైదరాబాదుకు వెళ్లేవలసిన పరిస్థితి నెలకొంది. పివి ప్రధానిగా ఉన్నప్పుడు పెద్ద పెళ్లి నిజాంబాద్ రైల్వే లైన్ పనులు మంజూరు చేసి పండ్లు పూరి చేయడంతో ఆర్మూర్ వరకు రైల్వే లింకింగ్ ఏర్పడింది.

అయితే ఆర్మూర్ నుండి బాల్కొండ పోచంపాడు నిర్మల్ బూత్ ఇచ్చోడ మీదుగా అదిలాబాద్ వరకు 120 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపడితే హైదరాబాద్ నాగపూర్ వెళ్లేందుకు నిర్మల్ వాసులకు సౌకర్యం ఉంటుంది. 1992 నుంచి నిర్మల్ ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసింది.

గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అధికారులకు వచ్చిన బిఆర్ ప్రభుత్వం రైల్వే లైన్ నిర్మాణం పై అప్పటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుత ఎంపీ జి నాగేష్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 50 ప్రాజెక్టు కింద రైల్వే లైన్ నిర్మాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా చేపట్టనున్నట్లు ప్రకటించారు. 2800 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 1900 కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే ఎన్నికలు రావడం డిపిఆర్ తయా రు కాకపోవడం ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం రైల్వే నిర్మాణానికి బ్రేకులు పడ్డా యి. సర్వేకు నవ్వు మాత్రం నిధులను మాత్రమే కేటాయించడంతో రైల్వే లైన్ నిర్మాణం ఒక అడుగు ముందు రెండు అడుగులు  వెలుక్కు అని చందాగా తయారైంది. 2023 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి బిఆర్‌ఎస్ మూడు పార్టీల ముఖ్య నేతలు రైల్వే నిర్మాణం నిధులు మంజూరు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ తర్వాత కనీసం సర్వేకు రైల్వే బడ్జెట్లో నిదుర కేటాయింపు చెప్పకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రులను కలవడం తప్ప.. మంచి జరగడం లేదు

నిర్మల్ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం పై ఇప్పటికీ అనేకసార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రులను ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు కలిసి నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి రైల్వే శాఖ మంత్రి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గేను కలవగా బిజెపి ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నువ కలిశారు గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి సీనియర్ నేతలు కూడా రైల్వే లైన్ నిర్మాణం పై కేంద్ర రైల్వే బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా మౌనంగా పోవడంపై ఇక్కడ ప్రజలు తీవ్ర అసంతృతీయ వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యేపైడి రాకేష్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవును కలిసి నిర్మల్ రైల్వే లైన్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించడం కొత్త చర్చకు దారితీస్తోంది. కేవలం 120 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం పై మూడు దశాబ్దాలుగా ప్రజల డిమాండ్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై పట్టించుకోకపోవడంపై ఇక్కడ ప్రజలు ప్రజాప్రతినిలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

ఇటీవలే నిర్మల్ జిల్లాకు చెందిన కొందరు సామాజికవేత్తలు ఉద్యమకారులు రైల్వే లైన్ నిర్మాణం కోసం ప్రజా ఉద్యమాన్ని చేపట్టేందుకు రైల్వే సాధన కమిటీ పేరుతో పోరాటం చేస్తామని హెచ్చరించడంతో ఇక్కడ నేతలు కేంద్ర ప్రభుత్వంపై రైల్వే లైన్ నిర్మాణానికి ఒత్తిడి తెచ్చేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసినట్టు ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం నిర్మలకు ఎలాంటి రైల్వే సౌకర్యాలు లేకపోవడంతో నిజామాబాద్ బాసర్ మంచిర్యాల ప్రాంతాలకు వెళ్లి రైల్వే ప్రయాణం చేయవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ను రూపొందించి బడ్జెట్లో నిధులు కేటాయించి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని ఇక్కడి ప్రాంత ప్రజలకు కోరుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.