19-07-2025 05:15:52 PM
టేకుమల సమ్మయ్య ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి..
కరీంనగర్ (విజయక్రాంతి): జిల్లాలోని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కార్యవర్గం తీర్మానం చేయడం జరిగింది. శనివారం రోజున బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్(AITUC) జిల్లా కౌన్సిల్ సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్లో కొమురయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించేటువంటి పథకాలు పూర్తిగా రోజురోజుకు మారుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం 282 జీవోను తీసుకువచ్చి 8 పని దినాలను తగ్గిస్తూ పది గంటల పని విధానాన్ని పెంచడం జరిగినదని ఆరోపించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగినది దీనివల్ల పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు పూర్తిగా హరించే విధంగా ఉన్నాయని వీటిని వెంటనే రద్దు చేయాలని విమర్శిస్తూ బిల్డింగ్ కార్మికుల కొరకు శ్రామిక పెరుతో ఇప్పటికే అనేక మైనటువంటి శిక్షణ తరగతులు పెట్టి సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభుత్వం ఏ ఒక్క కార్మికునికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన రానున్న రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలోనిర్ణయించడం జరిగినది. ఈ సమావేశంలో భవన నిర్మాణ సంఘం జిల్లాగౌరవ అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, కన్నం సదానందం కార్యదర్శులు కసిబోజుల సంతోష్ చారి, రేగుల కుమార్, కోశాధికారి గోదారి లక్ష్మణ్, మోసం తిరుపతి, బొట్ల ముండయ్య, బొజ్జ సదానందం తదితరులు పాల్గొన్నారు