19-07-2025 08:34:35 PM
చేగుంట తాసిల్దార్ శ్రీకాంత్..
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలంలో భూ భారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు భూభారతి చట్టం 2025, భూ భారతి రూల్స్ 2025 లోని(సెక్షన్ 4 (03), సెక్షన్ 8, కింద, భూభారతిలో సమస్యలపై ఆర్జీలు పెట్టుకున్న వ్యక్తులు, వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన తొమ్మిది రోజుల లోపల, తమ దగ్గర ఉన్న ఆధారాలతో సహా, అఫిడవిట్ ను జత చేస్తూ, పట్టా చేయు విషయంపైన గాని, పట్టా చేయుటకు అభ్యంతరము తెలుపుతూ, ఇతర ఏ రకమైన అభ్యంతరములు ఉన్నచో, రాతపూర్వకంగా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో అందజేయవలసిందిగా తెలిపారు.
నోటీసులు అందిన ఎవరైనా అర్జీదారులు, పై విషయంపై స్పందించలేని ఎడల తమ దగ్గర అందుబాటులో ఉన్న రికార్డులను అనుసరించి చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అర్జీదారులు భూ సమస్యలపై, పైరవికారులను, మధ్యవర్తులను, సంప్రదించకుండా, ఎలాంటి ప్రలోభాలకు, లోను కాకుండా రెవెన్యూ కార్యాలయంలో అధికారులను సంప్రదించవలసిందిగా, అవసరమైతే నేరుగా చేగుంట తాసిల్దార్ శ్రీకాంత్ ను సంప్రదించగలరని తెలియజేశారు.