20-07-2025 06:09:22 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): అసాంఘిక కార్యక్రమాల కట్టడి కోసం పోలీసు శాఖ కార్డెన్ సర్చ్ నిర్వహిస్తుందని గార్ల బయ్యారం సీఐ రవికుమార్(CI Ravikumar) అన్నారు. ఆదివారం ఉదయం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్ధారం గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి ఇండ్లలో అక్రమంగా నిల్వచేసిన నాటు సారా తయారీకి వినియోగించే బెల్లం పానకం ధ్వంసం చేశారు. అలాగే అక్రమంగా నిలువచేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గార్ల బయ్యారం సర్కిల్ పోలీసులు పాల్గొన్నారు.