19-07-2025 08:20:57 PM
కరీంనగర్,(విజయక్రాంతి): గుండెపోటుతో శుక్రవారం మరణించిన డీఎస్పీ మహేష్ అంత్యక్రియలు శనివారం కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీ స్మశానవాటికలో జరిగాయి. ఈ అంత్యక్రియల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పాల్గొని, డీఎస్పీ మహేష్ పార్థివ దేహంపై పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ, డీఎస్పీ మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
డీఎస్పీ మహేష్ సేవలను కొనియాడారు. కమిషనర్‌తో పాటు అడిషనల్ డీసీపీ (అడ్మిన్) వెంకటరమణ, అడిషనల్ డీసీపీ ఏఆర్ భీం రావుతో పాటు కమిషనరేట్‌కు చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది డీఎస్పీ మహేష్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.