calender_icon.png 20 July, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న పంటలో కత్తెర పురుగును నివారించుకోవాలి

19-07-2025 07:46:57 PM

తాడ్వాయి (విజయక్రాంతి): మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని దీనిని నివారించుకోవాలని వ్యవసాయ విస్తీర్ణాధికారి తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడువాయి మండలం దే మీకలాన్ గ్రామంలో శనివారం ఆయన రైతులతో కలిసి మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న పంట రెండు దఫాలుగా వేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. దీంతో యూరియా ఎరువులు మోతాదుకు మించి వాడుకున్నారని తెలిపారు. యూరియా ఎరువులు ఎక్కువగా వాడుకోవడం ద్వారానే కత్తెర పురుగు పెరిగిపోయిందని తెలిపారు. దీని నివారణకు క్లోరాంట్రా నీలిప్రోలు 80 మిల్లీలీటర్లు, ఈమెమేక్టివ్ బెంజేట్ 100 గ్రాములు, స్ప్రైనోట్రం 100 మిల్లీలీటర్లు వీటిలో ఏదైనా ఒక దాన్ని ఒక్క 150 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలని ఆయన సూచించారు.