25 May, 2026 | 2:39 AM

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి

18-04-2024 03:22 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం కాంగ్రెస్‌లో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కామారెడ్డిలో జరిగిన ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు. కాగా బీబీపేట మండలానికి చెందిన తేలు ప్రశాంత్ కంటిచూపు కోల్పోయి చికిత్స కోసం ఇబ్బందులు పడుతుండగా షబ్బీర్ అలీ చొరవతో సహాయ నిధి ద్వారా రూ.4.50 లక్షల ఎల్‌వోసీ చెక్కును మంజూరు చేయించి అందజేశారు.